Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీని ఈ అకడమిక్ ఇయర్ చివరి తేదీగా ప్రకటించిన విద్యాశాఖ మే 1 నుంచి జూన్ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి జూన్ 12వ తేదీ సోమవారం పాఠశాలలు వచ్చే అకాడమిక్ గానూ పునఃప్రారంభం అవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.