Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని పెద గంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే యువతి చనిపోయిన తర్వాత అర్ధరాత్రి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో యువతి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.