Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సింగపూర్
గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి సింగపూర్ బుధవారం ఉరిశిక్ష అమలు చేసింది. మరణశిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా జరిగిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. ఈ శిక్షపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్ అతడిని శిక్షించింది. భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య గంజాయి అక్రమ రవాణా కేసులో 2014లో అరెస్టయ్యాడు. ఒక కిలో గంజాయిని సింగపూర్‌కు అక్రమంగా తరలిస్తున్నాడన్న అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. ఈ కేసులో అతడికి అక్టోబర్ 9, 2018లో మరణశిక్ష పడింది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు నిర్ధారించిన న్యాయస్థానంఅతడికి శిక్ష విధించింది.