Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కెన్యా
షాకహోలాలో తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మంగళవారం నాటికి బయటపడ్డ మృతదేహాల సంఖ్య 90 కి చేరింది. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం భద్రపరిచేందుకు స్థలం లేకపోవడంతో తవ్వకాలను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. చనిపోయిన వారిలో చిన్నపిల్లల సంఖ్యే ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. మరికొంతమంది అడవుల్లో దాక్కుని ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
షాకహోలాలో పాస్టర్ మెకంజీ కారణంగా పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. కఠిన ఉపవాసంతో చనిపోతే జీసస్ ను కలుసుకుంటారని చెప్పడంతో పాస్టర్ మెకంజీ ఫాలోవర్లు తిండి, నీరు ముట్టకుండా ఉపవాసం చేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇలా చనిపోయిన వారిని షాకహోలా అటవీ ప్రాంతంలోని తన స్థలంలో పాస్టర్ మెకంజీ పాతిపెట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. మెకంజీకి చెందిన స్థలంలో తవ్వకాలు చేపట్టగా మంగళవారం నాటికి 90 మృతదేహాలు బయటపడ్డాయని వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను కెన్యా పోలీసులు షాకహోలా ఫారెస్ట్ మాస్కరేగా వ్యవహరిస్తున్నారు.