Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లోని ప్రజలు ప్రయివేట్ వాహనాల కంటే మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. మెట్రో స్టేషన్ల వద్ద జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇటీవల అమీర్పేట మెట్రో స్టేషన్కు ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. మెట్రో సర్వీసుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ముఖ్యమైన రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను అందుబాటులో ఉంచారు. ఈ షార్ట్ లూప్ ట్రిప్పుల వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా రైళ్ల కోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అమీర్పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులు నడుస్తాయి. అమీర్పేట-రాయదుర్గం కారిడార్లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. ప్రస్తుతం ప్రతి 7 నిమిషాలకు ఒక రైలు నడుస్తుండగా ఆ సమయాన్ని తగ్గించారు.