Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని కొన్ని అపార్ట్మెంట్లలో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఒక్కసారిగా భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో అక్కడి వాతావరణమంతా గందరగోళానికి గురైంది. అనంతరం బిస్రఖ్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.