Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ గురువారం జరగనుంది. మంగళవారం ఉదయమే విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ రాకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం నిన్న మధ్యాహ్నం నేటికి వాయిదా వేశారు. బుధవారం విచారణ చేపడతామని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు తెలిపింది. అయితే నేటీ జాబితాలో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ లేదు.
ఈ రోజు కోర్టు ప్రారంభం కాగానే అవినాశ్ రెడ్డి పిటిషన్ పైన విచారణ జరపాలని ఆయన తరఫు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇవాళ లిస్ట్ లో లేని కేసులపై విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి చెప్పారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయమూర్తి కోరగా... అందుకు కోర్టు సమ్మతించింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ చేపడతామని తెలిపింది.