Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్గా తిరిగి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు తగినంత బలం లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. డిప్యూటీ మేయర్ గా ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షెల్లీ ఒబెరాయ్, మహమ్మద్ ఇక్బాల్ లకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక రొటేషనల్ పద్ధతిలో ముగుస్తుంది.
ఒక్కో ఏడాదికి పదవిని ఒక్కో కేటగిరీకి రిజర్వ్ చేస్తారు. తొలి సంవత్సరం మహిళలకు రిజర్వ్ చేయగా, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరీగా ఉంచారు. మూడు ఏడాది రిజర్వ్ డ్ గా ఉంచి తర్వాతి రెండేళ్లు ఓపెన్ కేటగిరీగా నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత నగరానికి కొత్త మేయర్ వస్తారు. డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు జరగగా, ఆప్ అత్యధిక సీట్లు దక్కించుకుంది. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జెండా ఎగురవేశారు. ఫిబ్రవరి 22వ తేదీన షెల్లీ ఒబెరాయ్ తొలిసారి మేయర్గా ఎన్నికయ్యారు. అప్పుడు ఆమె రేఖా గుప్తాపై గెలుపొందారు.