Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం: నగరంలోని బీచ్లో వివస్త్రగా ఉన్న మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వైఎంసీఏ ఎదుట బీచ్లో శరీరంపై దుస్తులు లేని స్థితిలో వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని మూడో పట్టణ పోలీసులు గుర్తించారు. మంగళవారం వేకువజామున మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. వివాహిత ఐదునెలల గర్భిణి. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. విశాఖపట్నంలో అత్తమామల వద్ద వివాహిత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్లో భర్తతోనూ గొడవపడింది. ఆ తర్వాత వివాహిత కనిపించకపోవడంతో అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బీచ్లో మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఎవరైనా హత్య చేశారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.