Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరాన్పుర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్డీ)కు చెందినవారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా.. వీరి రాకను పసిగట్టి మావోయిస్టులు దాడి చేశారు. మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు.
అమరులైన జవాన్ల పేర్లు
1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్
2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి
3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్
4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్
5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి)
6. రవి పటేల్ - కానిస్టేబుల్
7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF)