Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతపురం
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. నార్పల నుండి పుట్టపర్తికి హెలికాప్టర్ లో జగన్ వెళ్లవలసి ఉంది. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరారు. జగన్ ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో నార్పలకు వెళ్లారు. నార్పల నుండి తిరిగి పుట్టపర్తి వెళ్లే సమయంలో మాత్రం హెలికాప్టర్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలోవెళ్లారు. జగన్ ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్ లలో గతంలోను రెండుమూడుసార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి.