Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: వివో ఎక్స్80 సిరీస్‌కు కొనసాగింపుగా భారత్‌లో వివో ఎక్స్90 సిరీస్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. వివో ఎక్స్90 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రొను వివో ప్రవేశపెట్టింది. వివో ఎక్స్90 సిరీస్ ప్రధానంగా కెమెరాపై ఫోకస్ చేసింది. వివో ఎక్స్90 ప్రొతో యూజర్లు డీఎస్ఎల్ఆర్ తరహా ఇమేజ్‌లను క్లిక్ చేయవచ్చు మెరుగైన కెమెరాలతో పాటు వివో ఎక్స్90 సిరీస్ పవర్ఫుల్ ఇంటర్నల్స్‌తో కస్టమర్లను ఆకట్టకుంటుంది. భారత్‌లో తొలి మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌ను వివో లేటెస్ట్ ఫోన్లో వినియోగిస్తోంది. ప్రొఫెషనల్ మొబైల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీస్‌తో వివో ఫ్లాగ్‌సిప్ స్మార్ట్ఫోన్ల కోసం చేతులు కలిపామని వివో ఇండియా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వికాస్ తగ్రా తెలిపారు. ఇక వివో ఎక్స్90 ప్రొ 12జీబీ, 256జీబీ వేరియంట్ రూ. 84,999 కాగా, ఎక్స్90 ధర రూ. 59,999 నుంచి ప్రారంభమవుతుంది. రెండు స్మార్ట్ఫోన్లు మే5 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్‌తో పాటు అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు నేటి నుంచి స్మార్ట్ఫోన్లను ప్రీ బుకింగ్ చేసుకుని ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వివో ఎక్స్90 హెచ్డీఆర్ +టెక్నాలజీతో కూడిన 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ వివో ఫోన్లు 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉన్నాయి.