Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాగేశ్వర్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన క్యాబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ (63) ఇకలేరు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురైన ఆయనను బాగేశ్వర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చందన్ రామ్ దాస్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
2007లో తొలిసారి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికైన చందన్ రామ్ దాస్ ఆ తర్వాత వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సారి పుష్కర్ సింగ్ ధామి క్యాబినెట్లో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. చందన్ రామ్ దాస్ మరణవార్త తెలిసి సీఎం సహా ఉత్తరాఖండ్‌కు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.