Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును మే 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మే 5వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడ్‌సెట్‌ను మే 18న ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో నిర్వహిస్తారు. ఎడ్‌సెట్‌ను గతంలో ఉస్మానియా వర్సిటీ నిర్వహించింది. ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.