Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ట్విట్టర్ యూజర్లు తమ కంటెంట్ నుండి డబ్బులు సంపాదించేందుకు మానిటైజేషన్ ఆప్షన్ తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. బ్లూ టిక్ కు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించారు. సుదీర్ఘ సమాచారం నుండి ఎక్కువ నిడివి గల వీడియోల ద్వారా దేనికైనా సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకొని డబ్బులు ఆర్జించవచ్చునని చెప్పారు. ఈ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ గురించి మస్క్ ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. యూజర్లు మానిటైజేషన్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా సబ్ స్క్రిప్షన్ కు వెళ్లవచ్చునని చెప్పారు.
అలా తన అకౌంట్ ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్ల సంఖ్యను రివీల్ చేశాడు. దీంతో మస్క్ ట్విట్టర్ అకౌంట్ కు రూ.24,700 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నట్లు వెల్లడైంది. ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ ధర అమెరికాలో నెలకు 5 డాలర్లు కాగా, యాపిల్ ఇన్ యాప్ పర్చేజ్, ట్విట్టర్ రెవెన్యూ షేర్ పోను ఒక్కో సబ్ స్క్రిప్షన్ నుండి 3.39 డాలర్ల చొప్పున కంటెంట్ క్రియేటర్ కు చెల్లిస్తుంది ట్విట్టర్. ఈ లెక్కన మస్క్ కు నెలకు ప్రస్తుతం నెలకు ఒక్కో సబ్ స్క్రైబర్ పైన రూ.277 చొప్పున వస్తోంది. అంటే నెలకు 24700 సబ్ స్క్రైబర్ల మీద 68,42,000 రూపాయలు వస్తున్నాయి. ఏడాదికి రూ.8 కోట్లకు పైగా వస్తుంది.