Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ: మిర్యాలగూడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని మయూరినగర్‌లోని సాయి దత్తా అపార్ట్మెంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు చేసి.. తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అపూర్వ రావు వెల్లడించారు. గత మూడేండ్ల నుంచి బంటు రాజేశ్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్లోనే బెట్టింగ్ నిర్వహిస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఠా సభ్యుల నుంచి రూ. 1.12 కోట్లు, రెండు కార్లు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో బంటు రాజేశ్(20) మిర్యాలగూడ, కోల సాయికుమార్(29), ఎస్ ఉదయ్ కుమార్(34), బంటు సంతోష్(29), రాచబంతి జీవన్(30), గంధం నవీన్(29), కొండవీటి రాజేశ్(35), నోట్ల సత్యనారాయణ(52), బంటు వంశీకృష్ణ(30) ఉన్నారు.