Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన 22 రోజులకే ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్కు 9,20,552 మంది విద్యార్థులు, వృత్తి విద్యాకోర్సులకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్లో 61 శాతం మంది విద్యార్థులు, సెకండియర్లో 72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 83 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, విజయనగరం జిల్లా 57 శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాల కోసం examresults.ap.nic.in, bie.ap.gov.in అనే వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు.