Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జహీరాబాద్: మంజీరా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ – హుమ్నాపూర్ శివారులో మంజీరా నది వద్ద గరుడ గంగా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి పంచవటీ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు.
మూడో రోజు బుధవారం మంజీరా వద్ద నాగసాధువులు, సంతులు గంగమ్మకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. పంచవటీ క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్‌బాబా పర్యవేక్షణలో మంజీరా కుంభమేళా జరుగుతున్నది. జహీరాబాద్ డీఎస్పీ రఘు, ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎల్పీవో రాఘవరావు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు తాగునీరు, స్నానాలు చేసుకోనేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.