Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంళవారం రాత్రి, బుధవారం ఉదయం వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రామచంద్రాపురంలో అత్యధికంగా 92 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 26వ తేదీన ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 27, 28 తేదీల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 29, 30వ తేదీల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో భారీ వర్షం లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మే 1, 2వ తేదీల్లో వర్షం లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.