Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆలయం షిర్డీకి హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. షిర్డీలో సాయిబాబాను దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే భక్తుల కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీ, నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఏసీ బస్సుల్లో అయితే పెద్దలకు రూ. 3,700, పిల్లలకు రూ. 3,010గా ఛార్జీ నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సుల్లో అయితే పెద్దలకు రూ. 2,400, పిల్లలకు రూ. 1,970గా నిర్ణయించారు. ఇక హోటల్ రూమ్‌ను కూడా తెలంగాణ టూరిజమే ప్రొవైడ్ చేయనుంది. దర్శనం టికెట్లు, ఆహార రుసుం ప్యాకేజీలో భాగం కాదు.
ఈ ప్రత్యేక ప్యాకేజీతో వెళ్లాలకునే వారిని సాయంత్రం సమయాల్లో హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, బషీర్‌బాగ్, ప్యారడైస్, బేగంపేట్, కేపీహెచ్‌బీ, మియాపూర్ ప్రాంతాల్లో భక్తులను తెలంగాణ టూరిజం బస్సులు పికప్ చేసుకోనున్నాయి. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు టూరిజం బస్సులు షిర్డీ చేరుకోనున్నాయి. హోటల్ గదిలో భక్తులు ఫ్రెషప్ అయిన వెంటనే అదే బస్సుల్లో దర్శనానికి తరలిస్తారు. దర్శనం అనంతరం షిర్డీ సమీపంలోని ఆలయాలకు భక్తులను తీసుకెళ్లనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బస్సులు బయల్దేరనున్నాయి. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నాయి. తదితర వివరాల కోసం https://tourism.telangana.gov.in/package/ShirdiTour ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.