Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలలో ఇంతా వేగంగా దూసుకెళ్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేడు మహారాష్ట్రకు చెందిన నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు సీఎం కేసీఆర్. ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతలకు పార్టీ కండువా కప్పి స్వయంగా సీఎం కేసీఆర్ పార్టీలోకి స్వగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ.. తెలంగాణలో తప్ప, దేశమంతా కరెంట్ సంక్షోభం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమృద్ధిగా జలాలు ఉన్నాయని.. అయిన వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేపోతున్నామని పేర్కొన్నారు. నీళ్లు ఫ్యాక్టరీలో తయారు కావనీ.. అది దేవుడిచ్చిన వరమని అన్నారు ఆయన. వాటిని మనమే ఒడిసి పట్టుకోవాలని తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరౌలి నుంచి గోదావరి నది ప్రవహిస్తోందని.. కానీ అక్కడ తాగేందుకు మంచి నీరు కూడా సరిగ్గా దొరకదని అన్నారు. దేశంలో ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటానికి కారణం ఎవరని అడిగారు. మనం మారకపోతే మన తల రాతలు మారవని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.