Authorization
Sun April 13, 2025 08:56:59 am
నవతెలంగాణ - హైదరాబాద్
మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు ఉచితంగా వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు జేఎన్టీయూ కృషి చేస్తోందని వీసీ కట్టా నరసింహారెడ్డి అన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూలో ‘సంతులన్’ పేరిట ఏర్పాటు చేసిన సైకలాజికల్ కౌన్సెలింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆత్మహత్యల నివారణ, యాంటీ ర్యాగింగ్ వంటి అంశాలపై కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జగిత్యాల, మంథని, సుల్తాన్పూర్, సిరిసిల్ల, వనపర్తి కళాశాలలను కూడా నెలకోసారి విజిట్ చేసి అక్కడ కూడా కౌన్సెలింగ్ ఇస్తారన్నారు.