Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఒడిశా
ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలో అప్పటిదాకా పెండ్లి ఊరేగింపులో వరుడి బంధువులు నృత్యాలతో దుమ్ము రేపారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఊరేగింపు మండపానికి చేరుకుంది. వధువు కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. మండపంలోకి వెళ్లిన వరుడు కాస్త సేద తీరుతున్నాడు. ఇంతలోనే భువనేశ్వర్ పోలీసులు రంగప్రవేశం చేశారు. అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే వరుణ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాలలోకి వెళితే.. ఢెంకానాల్‌కు చెందిన అజిత్‌కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఇటీవలే బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి.. వివాహ ముహుర్తంగా పెద్దలు ఖరారు చేశారు. ఆ మండపంలోనే పోలీసులు అజిత్‌ను అరెస్టు చేశారు. గత రెండేళ్లుగా భువనేశ్వర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్న అజిత్ పెండ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇపుడు మరో యువతితో పెండ్లికి సిద్ధపడటంతో ప్రియరాలు.. భువనేశ్వర్ మహిళా పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేసింది. అదీ సంగతి.