Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు, తీవ్రమైన గాయాలకు సహా అత్యవసర కేసుల్లో వైద్య సేవలు అందించే ఎంబీబీఎస్(అలోపతి) డాక్టర్లతో సమాన వేతనాలకు ఆయుర్వేద వైద్యులు అర్హులు కాబోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శవ పరీక్షల(పోస్ట్‌మార్టం)నూ అలోపతి వైద్యులే నిర్వహిస్తారని జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న వైద్యులతో సమానంగా ఆయుర్వేదం ప్రాక్టీషనర్లనూ పరిగణించాలంటూ 2012లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం కొట్టివేసింది. ప్రత్యామ్నాయ లేదా దేశీయ వైద్య విధానంగా ఆయుర్వేదం ప్రాముఖ్యతను గుర్తిస్తామని స్పష్టంచేసింది. అయితే అలోపతి వైద్యుల సేవలతో దానిని సరిపోల్చలేమని పేర్కొంది. రెండు వైద్య విధానాల్లో ఏది గొప్ప, ఏది తక్కువ అని చెప్పటం తమ ఉద్దేశం కాదని తెలిపింది. ఆధునిక వైద్య శాస్త్ర పరిజ్ఞానం, అత్యవసర సేవలు, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల నిర్వహణ వంటివన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు అలోపతి వైద్యులకే ఆయా విధులను కేటాయిస్తుంటారని గుర్తు చేసింది. ఆయుర్వేదానికి మన దేశంలో కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ ఆ వైద్యుల పని తీరు భిన్నమైదని ధర్మాసనం పేర్కొంది.