Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొత్తగూడెం
కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన ఓ యువతి కుక్కకాటు కారణంగా మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండాలో కొట్టెం ముత్తయ్య, తన కూతురు శిరీష(17)ను దాదాపు నెల రోజుల క్రితం వారి పెంపుడు కుక్కపిల్ల కరిచింది. ఆ సమయంలో ఈ విషయాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. తరవాత కొన్ని రోజులకు ముత్తయ్య వ్యాక్సిన్ వేయించుకోగా.. టీకా తీసుకోవడానికి శిరీష నిరాకరించింది. నాలుగు రోజుల క్రితం శిరీషలో రేబిస్ లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రేబిస్ లక్షణాలు ఉన్న కారణంగా హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. తిరిగి ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి శిరీష మృతి చెందింది.