Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 1570 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 157 మెడికల్ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. రానున్న రెండేళ్లలో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ప్రతి ఏడాది కొత్తగా 15,700 నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కలగనుంది. మెడికల్ పరికరాల రంగానికి సంబంధించి ఓ విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని మాండవీయ తెలిపారు.