Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: బోర్నవిటాలో హానికారక పదార్థాలున్నాయన్న ఆరోపణపై ఆ పౌడర్ ఉత్పత్తిదారు క్యాడ్బరీ మరింత చిక్కుల్లో పడింది. కొద్దిరోజుల క్రితం రేవంత్ అనే సోషల్మీడియా ఇన్లుయెన్సర్ బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెరతోపాటు క్యాన్సర్ కారకాలైన రంగులు కలుపుతున్నారని ఆరోపించటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఆ తర్వాత రేవంత్ క్యాడ్బరీకి క్షమాపణ చెప్పాడు. ఇంతలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెర కలుపుతున్నారని ఆరోపిస్తూ బుధవారం కాడ్బరీ మాతృ సంస్థ మోండెలెజ్కు నోటీసులు జారీచేసింది. క్యాన్సర్ కారకాలపై కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది.