Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పల్నాడు
టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో గాయపడిన ఆ పార్టీ కార్యకర్త అడుసుమిల్లి వెంకటేశ్వర్లు నేటి తెల్లవారుజామున మృతి చెందాడు. అమరావతి రోడ్డు షోలో రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొని అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో అడుసుమిల్లి వెంకటేశ్వర్లు చిక్కుకున్నాడు. మంటల్లో శరీరం చాలా వరకూ కాలిపోవడంతో అతడిని హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూనే నేటి తెల్లవారుజామున వెంకటేశ్వర్లు మృతి చెందారు. వెంకటేశ్వర్లు స్వస్థలం అచ్చంపేట మండలం గ్రంధశిరి.