Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుజరాత్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మోడీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. అయితే, ఈ కేసును తాను విచారించలేనని జస్టిస్ గీతా గోపీ తెలిపారు. ఈ మేరకు కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ కేసు విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆమె సూచించారు.
దీనిపై రాహుల్ తరపు న్యాయవాది పీఎస్ చపనేరి స్పందిస్తూ… రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ముందుగా విచారణ జరపాలని జస్టిస్ గీతా గోపి ధర్మాసనానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణకు మరో జడ్జికి కేటాయించేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.