Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తన ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో ఓ యువతి హాస్టల్ గదిలో ఉరేసుకుంది. ఎస్సార్‌నగర్ సబ్ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఓ యువతి(18) టెలీకాలర్‌గా పనిచేస్తూ అమీర్‌పేటలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. మంగళవారం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో హుటాహుటిన వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్వగ్రామంలో యువకుడితో ప్రేమలో పడిన ఆమెను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన ఆ యువతి నగరానికి వచ్చి హాస్టల్లో ఉంటోంది. నెల కిందట తన స్వగ్రామానికి వెళ్లి ఇంట్లోని తన సామగ్రిని తీసుకొని వచ్చింది. కుటుంబసభ్యులెవరితోనూ మాట్లాడలేదు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.