Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కర్ణాటకలో ఇటీవల ఓ 8 ఏళ్ల బాలిక రెడ్మీ సెల్ఫోన్ పేలుడుతో మృతి చెందిందన్న ఆరోపణలపై రెడ్మీ ఫోన్ల మాతృ సంస్థ తాజాగా స్పందించింది. కస్టమర్ల భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ‘‘ఈ కఠిన సమయంలో మేము బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. బాలిక రెడ్మీ ఫోన్ చేతిలో పట్టుకుని ఉండగా పేలుడు సంభవించినట్టు కొన్ని ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఇందులో నిజానిజాలను పోలీసులు ఇంకా తేల్చాల్సి ఉంది. ఈ ఘటన వెనుక కారణాలేంటో కనుక్కునేందుకు అధికారులకు సహకరిస్తాం. అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తాం’’ అంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిసూర్ జిల్లాకు చెందిన ఆ బాలిక చేతిలో సెల్ఫోన్ పట్టుకుని వీడియో చూస్తుండగా పేలుడు సంభవించి, మృతి చెందింది. బాలిక వద్ద ఉన్న రెడ్మీ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది నిజమాకాదా అన్నది పోలీసులు ఇంకా తేల్చాల్సి ఉంది.