Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష గురువారం ప్రారంభమైంది. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ మీనాక్షి నటరాజన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో దేశంలోని ప్రజలు కంటతడిపెట్టారన్నారు. స్వాతంత్రం కోసం గాంధీ కుటుంబం తన ఆస్తులను త్యాగం చేసిందని గుర్తుచేశారు. దేశమంతా బీజేపీ వ్యవహార శైలిని గమనిస్తుందని తెలిపారు.