Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్ది హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కేసు విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు గురువారం కడప నుంచి పులివెందుల వచ్చారు. ఈ క్రమంలో తొలుత వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. సీబీఐ అధికారులు వచ్చిన విషయం తెలియడంతో కృష్ణారెడ్డి తన ఇంట్లోనే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో విచారణ అధికారులు ఆయన ఇంటి బయటే నిరీక్షిస్తున్నారు.
వివేకా హత్య కేసులో గతంలోనే కృష్ణారెడ్డి అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. కేసు విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.