Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్‌లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి హుటాహుటిన ఓపీ బ్లాక్‌ను ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలుగానీ, గాయాలుగానీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.