Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పుణె: మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఏడు వాహనాలు ఒకటిని ఒకటి ఢీకొన్నాయి భారీ స్పీడ్‌లో అదుపు తప్పిన ఆ వెహికల్స్ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతిచెందారు. ఖొపోలి వద్ద ఈ ఘటన జరిగింది. ఢీకొన్న వాహనాల్లో కార్లు, లారీలు ఉన్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గాయపడ్డవారికి ప్రథమ చికిత్స అందించారు.