Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ తమ విమానయాన సంస్థ విస్తరణపై దృష్టి పెట్టింది. తాజాగా, 1000 పైలెట్లను నియమించుకునేందుకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిరిండియా ఇటీవలే రికార్డు స్థాయిలో, ప్రపంచ దిగ్గజ విమానయాన సంస్థలు విస్మయం చెందేలా, ఏకంగా 840 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి ఈ విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ క్రమంలో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడంపైనా ఎయిరిండియా నూతన మేనేజ్ మెంట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. తాజా నోటిఫికేషన్ ద్వారా కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్లు, ట్రైనర్లు సహా 1000 మంది పైలెట్లను తీసుకోనున్నారు. కాగా, ఇటీవల ఎయిరిండియా తీసుకువచ్చిన కొత్త వేతన విధానం, సర్వీసు నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ పైలెట్ యూనియన్లు దీనిపై అసంతృప్తితో ఉన్నాయి.