Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: దళితబంధుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్ వెల్లడించారు. ఇదే చివరి వార్నింగ్.. మళ్లీ రిపీట్ అయితే టికెట్ దక్కదని, ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచే సస్పెండ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అనుచరులు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు.