Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 16వ సీజన్లో వరుస ఓటములతో సతమతవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు పెద్ద షాక్. ఆ జట్టు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. తొడ కండరాల గాయంతో బాధ పడుతున్న అతను టోర్నీ నుంచి తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఈ రోజు వెల్లడించింది. 'తొడ కండరాల గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్ మొత్తానికి దూరం అవుతున్నాడు. వాషీ.. నువ్వు తొందరగా కోలుకోవాలి' అని ట్విట్టర్ పోస్టులో వెల్లడించింది.