Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఓటీటీ అగ్రిగేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన టాటా ప్లే బింగే, వేగంగా అభివృద్ధి చెందుతున్న 100% తెలుగు ఓటీటీ యాప్ ఆహా, రెండూ ఒక్క తాటిపైకి వచ్చి ఉత్తేజకరమైన భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంతో ఆహా ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, మ్యాక్స్ ప్లేయర్, సోనీ లివ్ తదితరాలతో సహా టాటా ప్లే బింగేలో 24 ఇతర ప్రముఖ ఓటీటీ యాప్‌ల ర్యాంక్‌లలో చేరనుంది. అదనంగా, టాటా ప్లే డీటీహెచ్ చందాదారులు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలను యాడ్-ఆన్‌లుగా ఆస్వాదించవచ్చు. ప్రామాణికమైన కథాకథనం, అసమానమైన వినోదం, గొప్ప సాంస్కృతిక అనుభవాన్ని సూచించే తన పేరుకు సార్థకతను అందిస్తూ, తెలుగు సంస్కృతిని వేడుక చేసుకునే ప్రముఖ వేదికగా ఆహా ఇప్పటికే ప్రజాదరణతో దూసుకుపోతుంది. మై హోమ్ గ్రూప్, అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్) సహ యాజమాన్యంలో ఆహా ప్రపంచవ్యాప్తంగా 190+ దేశాలలో ప్రజాదరణ పొందింది. ఆవిష్కరణ మరియు వినియోగదారుని అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆహా 750+ ఫిల్మ్‌లు మరియు 40+ ఒరిజినల్ షోలు, థియేటరికల్ రిలీజ్లు, టాక్ షోలు మరియు రియాలిటీ షోలతో సహా పలు రకాల ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తుంది. తెలుగు వినోద పరిశ్రమలో నటుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మరియు నిర్మాత దిల్ రాజు వంటి ప్రముఖుల నాయకత్వంలో, ఆహా తెలుగు కంటెంట్‌కు ప్రమాణాన్ని నెలకొల్పుతూనే ఉంది. ఇది అసమానమైన వినోద అనుభవాన్ని అందిస్తూ, ప్రామాణికమైన మరియు ఆకర్షణీయమైన, తెలుగు మాట్లాడే సమాజపు వారసత్వపు గొప్ప సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులో థియేటరికల్ రిలీజ్లు మాత్రమే కాకుండా ప్రముఖ టాక్ షోలు, డైలీ సీరియల్స్ మరియు ప్రసిద్ధ రియాలిటీ షోలు కూడా ఉన్నాయి. ఇవి తెలుగు ప్రేక్షకులకు సమగ్ర వినోద అనుభవాన్ని అందిస్తాయి.
‘‘మేము మా సరికొత్త భాగస్వామి ఆహాను టాటా ప్లే బింగే కుటుంబానికి స్వాగతిస్తున్నాము. అతిపెద్ద మరియు అత్యంత జనాదరణ పొందిన తెలుగు కంటెంట్ ఓటీటీ యాప్‌గా, బింగేకి ఆహా సరిగ్గా సరిపోతుంది. మా చందాదారులకు తెలుగులో సినిమాలు మరియు ఒరిజినల్‌ల గొప్ప ఎంపికను అందజేస్తుంది. అలాగే, 25+ భాగస్వాముల నుంచి ఎప్పటికప్పుడు పెరుగుతున్న కేటలాగ్‌కు జోడించబడుతుంది’’ అని టాటా ప్లే చీఫ్ కమర్షియల్ మరియు కంటెంట్ ఆఫీసర్ పల్లవి పురి తెలిపారు.
ఈ భాగస్వామ్యం ప్రారంభమైన నేపథ్యంలో ఎస్వీఓడీ & బిజినెస్ స్ట్రాటజీ హెడ్ - రాకేష్ సీకే మాట్లాడుతూ, ‘‘టాటా ప్లే బింగేతో మా భాగస్వామ్యానికి మేము సంతోషిస్తున్నాము. ఈ సహకారం భారతీయ ఓటీటీ స్పేస్‌లో రెండు ప్రముఖ ప్లాట్‌ఫారాలను ఒకచోట చేర్చింది. తెలుగు కంటెంట్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షకులకు అందించేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. టాటా ప్లే బింగే ఓటీటీ యాప్‌ల సముదాయంతో, ఆహా నుంచి ఆకర్షణీయమైన మరియు ప్రామాణికమైన తెలుగు కంటెంట్ ఇప్పుడు మరింత మంది వీక్షకులకు అందుబాటులోకి వస్తోంది. మా ప్రేక్షకులకు అసమానమైన వినోదాన్ని అందించాలనే మా నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది’’ అని వివరించారు.
తెలుగు ఇండియన్ ఐడల్, దాస్ కా ధమ్కీ, ఎన్బికెతో అన్‌స్టాపబుల్ సీజన్ 2, వినరో భాగ్యము విష్ణు కథ, మసూద, ఓరి దేవుడా, డిజె టిల్లు, భీమ్లా నాయక్, కలర్ ఫోటో తదితర పలు సూపర్ హిట్ షోలను, విభిన్న వినోద శ్రేణిని, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ను ఆహా కలిగి ఉంది.
ఒకే సబ్స్క్రిప్షన్ మరియు యూనిఫైడ్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా, టాటా ప్లే బింగే వీక్షకులకు 25+ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వీక్షకుల కంటెంట్ శోధన సమయాన్ని తగ్గించే యూజర్ ఫ్రెండ్లీ పద్ధతిలో అన్నీ కలిసి బండిల్‌గా అందుబాటులో ఉంటాయి. ఎగువ పేర్కొన్న యాప్‌లతో పాటు, టాటా ప్లే బింగేలో రీల్ డ్రామా, వూట్ సెలక్ట్, హోయ్‌చోయ్, ప్లానెట్ మరాఠి, నమ్మ ఫ్లిక్స్, చౌపాల్, సన్‌నెక్ట్స్, హంగామా ప్లే, ఎరోస్ నౌ, షీమారోమీ, వూట్ కిడ్స్, మనోరమా మ్యాక్స్, కూడే, తరంగ్ ప్లస్, క్యూరియాసిటీ స్ట్రీమ్, ఎపిక్ ఆన్, షార్ట్స్ టీవీ, ట్రావెల్ఎక్స్పీ మరియు డాక్యుబే కూడా ఉన్నాయి. ఎంగేజ్మెంట్కు మరొక పాయింట్‌గా ప్లాట్‌ఫారమ్‌లో ఉచిత గేమింగ్ కూడా అందుబాటులో ఉంది. టాటా ప్లే డీటీహెచ్ వినియోగదారుల కోసం కోసం నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా ప్లే బింగే+ ఆండ్రాయిడ్ సెట్ టాప్ బాక్స్, అమెజాన్ ఫైర్‌టివి స్టిక్‌లతో టాటా ప్లే ఎడిషన్ మరియు www.TataplayBinge.com ద్వారా పెద్ద స్క్రీన్ కనెక్ట్ చేయబడిన పరికరాలలో వీక్షకులు ఈ యాప్‌లన్నింటినీ ఆస్వాదించవచ్చు.