Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చి గూడ్స్ ట్రాలీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలి నుంచి గూడ్స్ ట్రాలీ డ్రైవర్ పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.