Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్: రోడ్డు పక్కన డీజిల్ అమ్ముతున్న షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంఘటన బోరబండలో గురువారం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో రెండు కార్లు, బైక్ దగ్దమైంది. పోలీసుల కథనం ప్రకారం బోరబండలోని రోడ్డు పక్కన ఓ వ్యక్తి డీజిల్ విక్రయిస్తున్నాడు. అక్కడే మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నారు. అందులోనే పెట్రోల్,డీజిల్‌ను ఎలాంటి అనుమతి లేకుండానే విక్రయిస్తున్నాడు. ఇందులోనే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.దీంతో అక్కడే పార్కింగ్ చేసిన రెండు కార్లు, బైక్ దగ్దమైంది. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు రెండు ఫైరింజన్లను పంపించి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి 10నిమిషాల్లో చేరుకున్నామని తెలిపారు.