Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా సుడాన్ ఆర్మీ, పారామిలటరీ దళం మధ్య భీకర పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందేౌఅంతర్గత యుద్ధం వల్ల సుడాన్లో చిక్కుకున్న భారతీయులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. దీంతో సుడాన్ నుంచి రెండో బ్యాచ్‌గా మరో 246 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానంలో ముంబై చేరుకున్నారు. పరస్పర దాడుల్లో సుమారు 500 మంది పౌరులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించి సురక్షితంగా భారత్‌కు చేర్చేందుకు ాఆపరేషన్ కావేరి్ణ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కాగా, తొలుత సుడాన్ నుంచి వందలాది మంది భారతీయులను యుద్ధ నౌకల ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి భారత వాయుసేనకు చెందిన భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ ద్వారా గురువారం ముంబైకి తీసుకొచ్చారు.