Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. రాజస్థాన్ నిర్ణిత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో చెన్నైకి 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలచి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ అరంభం నుంచి దాటిగా ఆడింది. ఓపెనర్ జైశ్వాల్ (77) అద్భుత అర్ద సెంచరీ సాధించాడు. బట్లర్ (27) పరుగులు చేయగా చివర్లో ద్రువ్ జురైల్ 15 బంతుల్లో 34 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. పడిక్కల్ (23) పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో దేశ్ పాండే రెండు వికెట్లు తీయగా తీక్షణ, జడేజా చేరో వికెట్ తీసుకున్నారు.