Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
అవయవదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల ప్రత్యేక సాధారణ సెలువులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవయవదానంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా దాత అవయవదానం కోసం చేయించుకునే సర్జరీ నుంచి కోలుకునేందుకు మరింత సమయం అవసరమని, అందుకోసమే స్పెషల్ క్యాజువల్ లీవ్‌లను పెంచినట్టు కేంద్రం తెలిపింది.
అంతేకాదు, దాత చేయించుకునే ఎలాంటి సర్జరీ అయినా ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడి సూచన మేరకు అవయవదాతకు సెలవులు ఇస్తామని పేర్కొంది. ఈ సెలవులను ఒకేసారి కానీ, విడతల వారీగా కానీ ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది.