Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి : మంత్రి జోగి రమేష్ ఓ పోలీస్ ఆఫీసర్ విషయంలో దారుణంగాప్రవర్తించారు. పది మందిలో డిఎస్పీ మాన్షూ భాషా ను పక్కకు పో అంటూ జోగి రమేష్ విసుక్కోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నేడు మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటిస్తున్నారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఇదే సమయంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్ప గుచ్చం ఇచ్చేందుకు వచ్చారు. ఎస్పీకి అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలని డీఎస్పీ కోరారు. దీంతో పక్కకు వెళ్లు ముందు అంటూ డీఎస్పీపై మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ తీరుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.