Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ఓ యువకుడు పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వటం కలకలం రేపింది. తొలుత బాంబు సమాచారం తెలుసుకొన్న పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. చివరికి అదంతా బూటకమని తేలటంతో వారు కంగుతిన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ‘ఇందిరా గాంధీ విమానాశ్రయంలో బాంబు పెట్టారు.. వెంటనే అప్రమత్తం కావాలి’’ అని ఓ యువకుడు పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో తక్షణమే ప్రత్యేక బృందాలు ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నాయి. బాంబు కోసం గాలింపు చేపట్టాయి. అయినా బాంబు జాడ లభించలేదు. దీంతో అధికారులు సదరు యువకుడికి తిరిగి ఫోన్ చేశారు. కానీ, అప్పటికే ఆ యువకుడు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఇదంతా బూటకమని తేలింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అతని ఫోన్ లొకేషన్ తెలుసుకొన్నారు. అతను ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్ చెందిన 20 ఏళ్ల జాకీర్‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.