Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఇవాళ ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా రక్షణ మంత్రి లీ షాంగ్పూ పాల్గొన్నారు. ఎస్సీవో సభ్యదేశాల్లోని రక్షణ మంత్రులు గ్రూపు ఫోటో దిగారు. ప్రాంతీయ భద్రత అంశంపై రక్షణ మంత్రులు చర్చించారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదంపై కలిసి కట్టుగా పోరాడాలన్నారు. ఎస్సీవో బలపడాలంటే, కలిసి పోరాడాలన్నారు. సోషల్ మీడియా, క్రౌడ్ ఫండింగ్ లాంటి కొత్త పద్ధతులను ఉగ్ర గ్రూపులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. మన ముందున్న ఇలాంటి సవాళ్ల గురించి చర్చించి, ఈ సమావేశంలో పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అన్నారు. ఎస్సీవో సభ్యుల మధ్య రక్షణ సహకారం మరింత బలపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.