Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన ఓ 20 ఏండ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫోన్‌కాల్ ఓ బూటకమని తేలినట్లు వారు వెల్లడించారు. బూటకపు కాల్ చేసిన వ్యక్తిని జాకీర్‌గా గుర్తించినట్లు చెప్పారు
ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సోమవారం గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో బాంబు పెట్టారు అని పోలీసులకు చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో అధికారులు కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్ నంబర్‌కు తిరిగి కాల్ చేయగా.. అప్పటికే ఆ నంబర్ స్విచ్ఛాఫ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదంతా బూటకమని తేలిందన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు అతని ఫోన్ లొకేషన్ తెలుసుకున్నామన్నారు. అతను ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌కు చెందిన 20 ఏండ్ల జాకీర్‌గా గుర్తించినట్లు తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.