Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఎత్తర జెండా' పాటలో సైడ్ డ్యాన్సర్ గా చేసిన మణికంఠన్ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే బంజారా హిల్స్ రాఘవ రెసిడెన్సీలో మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మణికంఠన్ మందు తాగి గొడవ చేస్తుండగా వాచ్ మెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కారిడార్ లో గొడవ చేయవద్దని సూచించాడు. దీంతో, కోపం తట్టుకోలేకపోయిన మణికంఠన్ వాచ్ మెన్ తో గొడవపడ్డాడు. అతడిని మూడవ అంతస్తు నుంచి తోసేశాడు. ప్రస్తుతం వాచ్ మెన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మణికంఠన్ ను అరెస్ట్ చేశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన మణికంఠన్ ప్రస్తుతం టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు.