Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఏడుకొండల స్వామిని 65,910 మంది భక్తులు దర్శించుకోగా 27,838 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.80 కోట్లు వచ్చిందని తెలిపారు. మే 4న తిరుమలలో శ్రీ నృసింహ జయంతిని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తామని , శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారని అధికారులు వెల్లడించారు.